కొనసీమ జిల్లా కొత్తపేటలో అల్లూరి సీతారామరాజు 101వ వర్ధంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో చోటు చేసుకున్న ఓ ఘటన చర్చనీయాంశంగా మారింది.మన్యం వీరుడు,విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు చిత్రపటాన్ని నేతలు పాదాల వద్ద ఉంచిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.ఈ కార్యక్రమంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే చీరాల జగ్గి రెడ్డి, ప్రస్తుత ఎమ్మెల్సీ తోట తిమూర్తులు,మాజీ మంత్రి సీ వేణుగోపాల్ పాల్గొన్నారు.మహానీయుడి చిత్రాన్ని ఈ విధంగా ఉంచడంపై పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.అల్లూరి వంటి మహనీయులకు ఇచ్చే గౌరవం ఇదేనా? అంటూ నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.వారి చర్యలు అల్లూరి అభిమానుల మనసును బాధించాయని వ్యాఖ్యానిస్తున్నారు.ఒక వేళ తెలియక చేసిన తప్పయినా,నేతలు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.అల్లూరి సీతారామరాజు గారి గౌరవాన్ని భద్రంగా కాపాడాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులదే అని పోస్ట్లు పెడుతున్నారు.అయితే ఈ ఘటనపై వైసీపీ నాయకులు తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.అయితే సోషల్ మీడియాలో ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.అల్లూరి అభిమానులు నేతలపై విమర్శలు గుప్పిస్తున్నారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు