భారత సాయుధ దళాలు పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే)లోని ఉగ్రవాద స్థావరాలపై ఈరోజు తెల్లవారుజామున కచ్చితమైన దాడులు చేశాయి. ఈ కీలక పరిణామం అనంతరం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశమయ్యారు. ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో చేపట్టిన ఈ సైనిక చర్యకు సంబంధించిన కీలక వివరాలను ప్రధాని రాష్ట్రపతికి వివరించారు. భారత సైన్యం చేసిన ఈ దాడుల్లో భాగంగా, పాకిస్తాన్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ), జైషే మహ్మద్ (జేఈఎం) వంటి ఉగ్రవాద సంస్థలకు చెందిన తొమ్మిది కీలక స్థావరాలు ఉండడం పాక్ ఏస్థాయిలో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుందో అర్థమవుతోంది. అంతర్జాతీయంగా పాకిస్థాన్ నీచ బుద్ది మరోసారి తేటతెల్లమైంది.
‘ఆపరేషన్ సింధూర్’ :రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ప్రధాని మోడీ సమావేశం
By admin1 Min Read