వైవిధ్యభరితమైన కథాంశంతో వర్తమాన నేర ప్రపంచంలో జరుగుతున్న ఘటనలే ఇతివృత్తంగా తెరకెక్కిన చిత్రం “కర్మణ్యే వాధికారస్తే”. ఈ నేర ప్రపంచంలో జరిగే ఉదంతాలను కర్తవ్యమే దైవంగా భావించే ఒక పోలీసు అధికారుల బృందం ఏవిధంగా ఎదుర్కొంది అనేది ఈచిత్రం యొక్క కథాంశం. తాజాగా నేడు ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు. అద్భుతమైన విజువల్స్ ఆసక్తికర కథాంశంతో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా రూపొందించినట్లు ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతోంది.
అమర్ దీప్ చల్లపల్లి దర్శకత్వం వహించారు. తొలి ప్రయత్నంలోనే తన దర్శకత్వ శైలితో ఆకట్టుకున్నారు. ఉషస్విని ఫిలిమ్స్ పతాకంపై డిఎస్ఎస్ దుర్గా ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్. భాస్కర్ సామల సినిమాటోగ్రఫీ అందించారు. గ్యానీ సంగీతం సమకూర్చారు. కథ- సంభాషణలు శివకుమార్ పెళ్లూరు అందించారు. శత్రు, బ్రహ్మాజీ, ‘మాస్టర్’ మహేంద్రన్ ప్రధాన పాత్రల్లో నటించగా…పృథ్వీ, శివాజీరాజా, శ్రీ సుధా, బెనర్జీ, అజయ్ రత్నం తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఐరా దయానంద్ రెడ్డి ఈచిత్రంతో పరిచయమవుతున్నారు.
అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సన్నద్ధమవుతోంది. తాజాగా ఈ విభిన్నమైన యాక్షన్ ఎంటర్టైనర్ నుండి టీజర్ విడుదలై ఆద్యంతం ఉత్కంఠభరితంగా నిలిచి చిత్రంపై మరింత ఆసక్తిని రేకెత్తించింది.
బ్యానర్: ఉషస్విని ఫిలిమ్స్
చిత్రం పేరు: కర్మణ్యే వాధికారస్తే
ఆర్ట్: నాయుడు
సంగీతం: గ్యాని
ఎడిటర్: మార్తాండ్ కె వెంకటేష్
డి ఓ పి: భాస్కర్ సామల
కథ, మాటలు: శివ కుమార్ పెళ్లూరు
ఫైట్ మాస్టర్: రామ్ సుంకర, డ్రాగన్ అంజి
లిరిక్స్: శ్రేష్ఠ (అర్జున్ రెడ్డి)
స్టిల్స్: మహేష్ పింజల
టీజర్ కట్: వాల్స్ అండ్ ట్రెండ్స్
అసోసియేట్ డైరెక్టర్: ప్రమోద్ తెలకపల్లి
పోస్ట్ ప్రొడక్షన్: సారధి స్టూడియోస్, ప్రసాద్ లాబ్స్
మార్కెటింగ్: వంశి కృష్ణ (సినీ డిజిటల్)
పి ఆర్ ఓ: పాల్ పవన్
పబ్లిసిటీ డిజైనర్: ఏ జె ఆర్ట్స్
నిర్మాత”: డి ఎస్ ఎస్ దుర్గ ప్రసాద్
స్క్రీన్ ప్లే మరియు దర్శకత్వం: అమర్ దీప్ చల్లపల్లి.
Previous Articleచివరి ఉగ్రవాదిని ఏరివేసే వరకు “ఆపరేషన్ సిందూర్” కొనసాగాలి: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
Next Article టెస్టు క్రికెట్ కు వీడ్కోలు పలికిన రోహిత్ శర్మ