భారతదేశంలోని 15 నగరాలపై ఉగ్రవాద దాడులకు పాకిస్థాన్ చేసిన ప్రయత్నం విఫలమైన సంగతి తెలిసిందే. తాజాగా జమ్మూ కశ్మీర్‌లోని పలు ప్రాంతాలపై పాకిస్థాన్ దాడులకు తెగబడింది. ఈ పరిణామంతో సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పాకిస్థాన్ ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్లను భారత ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఆకాశంలోనే ఎదుర్కొన్నాయి. సోషల్ మీడియా లో ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి.జమ్మూతో పాటు 300 కిలోమీటర్ల దూరంలోని కుప్వారా, పంజాబ్‌లోని పఠాన్‌కోట్, గురుదాస్‌పూర్ పట్టణాలలో కూడా విద్యుత్ సరఫరా నిలిపివేసి, బ్లాక్‌అవుట్ ప్రకటించారు. బారాముల్లాలోనూ పూర్తిస్థాయి బ్లాక్‌అవుట్ అమలులో ఉంది. పాకిస్థాన్ దుందుడుకు చర్యలకు పాల్పడింది. సత్వారీ, సాంబా, ఆర్‌ఎస్ పురా, అర్నియా సెక్టార్లను లక్ష్యంగా చేసుకుని పాకిస్థాన్ ఎనిమిది క్షిపణులను ప్రయోగించినట్లు రక్షణ వర్గాలు తెలిపాయి. అయితే, భారత వాయు రక్షణ విభాగాలు అప్రమత్తంగా వ్యవహరించి, ఈ క్షిపణులన్నింటినీ గాల్లోనే ధ్వంసం చేశాయి.
కయ్యానికి కాలు దువ్విన పాక్… సమర్థవంతంగా తిప్పికొడుతున్న భారత్
By admin1 Min Read

