భారత్ వైపు కన్నెత్తి చూడాలంటే భయపడే విధంగా శత్రుదేశాన్ని బెంబేలెత్తించిన ‘ఆపరేషన్ సిందూర్’ అనే టైటిల్ పై మూవీ రాబోతుంది. ఏప్రిల్ 22న జరిగిన పహల్గాం ఉగ్రదాడికి వ్యతిరేకంగా మన సైన్యం చేపట్టిన ‘ఆపరేషన్ ‘సిందూర్’ పేరుతో బాలీవుడ్ లో సినిమాను రూపొందిస్తున్నారు. దీనిపై అధికారిక ప్రకటన చేసి ఓ పోస్టర్ ను విడుదల చేశారు. నిక్కీ విక్కీ భగ్నానీ ఫిల్మ్స్ బ్యానర్ పై ఈ మూవీ తెరకెక్కనుంది. తాజాగా విడుదల చేసిన పోస్టర్ లో యూనిఫాం ధరించి రైఫిల్ పట్టుకొని నుదుటన సిందూరం పెట్టుకుంటోన్న మహిళ కనిపిస్తున్నారు. ఇక ఈ మూవీకి సంబంధించి త్వరలోనే ఇందులో నటీనటుల వివరాలను వెల్లడించనున్నట్లు తెలుస్తోంది.
Previous Articleపాక్ డ్రోన్ లాంచింగ్ ప్యాడ్ ను ధ్వంసం చేసిన భారత్
Next Article ప్రధాని మోడీ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం