భారత్- పాకిస్థాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు కాస్త నెమ్మదించే దిశగా అడుగులు పడుతున్నాయి. కాల్పుల విరమణకు అంగీకరించాయని, ఇందుకు అమెరికా మధ్యవర్తిత్వం వహించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ఈ మేరకు తన ట్రూత్ సోషల్ మీడియా లో నేటి సాయంత్రం ఓ పోస్ట్ పెట్టారు. “అమెరికా మధ్యవర్తిత్వంలో రాత్రంతా సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. తక్షణమే కాల్పుల విరమణ చేపట్టేందుకు భారత్, పాక్ అంగీరించాయి. సరైన సమయంలో రెండు దేశాలు విజ్ఞతతో, సంయమనంతో వ్యవహరించాయి. దానికి ధన్యవాదాలని ట్రంప్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. ఈ విషయాన్ని భారత్, పాక్ వేర్వేరు ప్రకటనల్లో ధ్రువీకరించాయి.
కాల్పుల విరమణకు భారత్-పాక్ అంగీకారం: అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్
By admin1 Min Read
Previous Articleప్రధాని మోడీ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం
Next Article కాల్పుల విరమణకు భారత్- పాక్ అంగీకారం