భారత టెస్ట్ క్రికెట్ లో ఒక అత్యద్భుత శకం ముగిసింది.
భారత స్టార్ క్రికెటర్ ఈ తరం మేటి ఆటగాడు విరాట్ కోహ్లీ అనుకున్నట్లుగానే టెస్టు క్రికెట్ నుండి వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు. ఇటీవలే రోహిత్ శర్మ టెస్టు క్రికెట్ నుండి తప్పుకున్న సంగతి తెలిసిందే. కోహ్లీ కూడా తన బాటలోనే పయనించాడు. వీరిద్దరూ ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ తరువాత ఒకే సారి ఆ ఫార్మాట్ నుండి తప్పుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి రిటైర్మెంట్ ప్రకటనలతో భారత టెస్ట్ క్రికెట్ లో ఒక శకం ముగిసినట్లయింది. విరాట్ కోహ్లీ 14 సంవత్సరాల పాటు టెస్ట్ క్రికెట్ కు ప్రాతినిథ్యం వహించాడు. 2011లో వెస్టిండీస్ తో మొదటి టెస్ట్ ఆడాడు. తన కెరీర్ లో 123 టెస్టు మ్యాచ్ లు ఆడి 30 సెంచరీలు, 31 హాఫ్ సెంచరీలతో మొత్తం 9,230 పరుగులు చేశాడు. ఈ ఏడాది జనవరి 3న ఆస్ట్రేలియాతో చివరి టెస్ట్ ఆడాడు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు