‘ఆపరేషన్ సింధూర్’ పై డీజీఎంవో ఎయిర్ మార్షల్ ఏకే భారతి కీలక ప్రకటన చేశారు. మా పోరాటం పాక్ ఆర్మీ, ప్రజలపై కాదని పేర్కొన్నారు. భారత్ పోరాటం ఉగ్రవాదంపైనేనని ఏకే భారతి మరోసారి పునరుద్ఘాటించారు. దేశం కోసం తమ బాధ్యత నిర్వర్తించామని తెలిపారు. పాకిస్తాన్ వివిధ రకాల డ్రోన్లను వినియోగించిందని దేశీయంగా తయారు చేసిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ తో మనం వాటిని అడ్డుకున్నట్లు తెలిపారు. ఆకాశ్ డిఫెన్స్ సిస్టమ్స్ తో శత్రువులను దీటుగా ఎదుర్కొన్నట్లు పేర్కొన్నారు. చైనా తయారు చేసిన పీఎల్-15 మిస్సైళ్లతో పాక్ దాడి చేసిందని అయితే వాటిని మనం ఆకాశ్ క్షిపణులతో నిర్వీర్యం చేశామని చెప్పారు. పాక్‌లోని నూర్‌ఖాన్ ఎయిర్‌బేస్‌పై ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ దాడి చేసిందని తెలిపారు. దీంతో నూర్‌ఖాన్ ఎయిర్‌బేస్ రన్‌వేకు తీవ్రనష్టం జరిగిందన్నారు. ఉగ్రవాదులు కొన్నేళ్లుగా తమ వ్యూహాలను మార్చుకుంటున్నారు. సైనికులనే కాకుండా, యాత్రికులను, భక్తులను టార్గెట్ చేస్తున్నారు. 9, 10 తేదీల్లో పాక్ మన వైమానిక స్థావరాలను టార్గెట్ చేసింది. కానీ, మన డిఫెన్స్ వ్యవవస్థతో వాటిని అడ్డుకున్నామని పేర్కొన్నారు. మల్టీ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను దాటుకొని పాక్ మన వైమానిక స్థావరాలను ధ్వంసం చేయలేకపోయిందని డీజీఎంవో ఎయిర్ మార్షల్ ఏకే భారతి స్పష్టం చేశారు. దేశప్రజలంతా భద్రతాదళాలకు అండగా నిలిచారని పేర్కొన్నారు. శత్రువుల విమానాలను మనదేశంలోకి రాకుండా అడ్డుకున్నాం. మన అన్ని సైనిక స్థావరాలు సిద్ధంగా ఉన్నాయి. ఎలాంటి ఆపరేషన్‌కు అయినా సన్నద్ధంగా ఉన్నామని తెలిపారు . పాక్ కు జరిగిన నష్టాన్ని ఆ దేశం చెప్పుకోవడం లేదని డీజీఎంవో ఎయిర్ మార్షల్ ఏకే భారతి తెలిపారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు