భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సంజీవ్ ఖన్నా నేడు పదవీ విరమణ చేయనున్నారు. దేశ 51వ చీఫ్ జస్టిస్ గా ఆయన సేవలందించారు. ఆయన స్థానంలో, సుప్రీంకోర్టులో రెండవ అత్యంత సీనియర్ న్యాయమూర్తి అయిన జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ నూతన సీజేఐగా బాధ్యతలు స్వీకరించనున్నారు. జస్టిస్ సంజీవ్ ఖన్నా తన పదవీ విరమణకు ముందు తదుపరి సీజేఐగా జస్టిస్ బి.ఆర్. గవాయ్ పేరును కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖకు అధికారికంగా సిఫార్సు చేశారు. ఈ సిఫార్సుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. దీంతో జస్టిస్ గవాయ్ భారత 52వ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జస్టిస్ ఖన్నాకు అధికారిక వీడ్కోలు కార్యక్రమం జరగనుంది.
నేడు సీజేఐగా జస్టిస్ సంజీవ్ ఖన్నా పదవీ విరమణ… కొత్త సీజేఐగా జస్టిస్ రామకృష్ణ గవాయ్
By admin1 Min Read