దౌత్య పరంగా భారత్ మరో విజయం సాధించింది. భారత జవాన్ పూర్ణమ్ కుమార్ షాను పాకిస్తాన్ అప్పగించింది. బిఎస్ఎఫ్ జవాన్ పూర్ణమ్ కుమార్ షా ఏప్రిల్ 23న సరిహద్దు దాటి పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళాడు. దీంతో పాక్ రేంజర్లు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం, భారత్-పాక్ మధ్య సంప్రదింపుల ద్వారా నేడు అట్టారి సరిహద్దు వద్ద భారత అధికారులకు పూర్ణమ్ కుమార్ షాను పాకిస్తాన్ భారత్ కు అప్పగించింది. అప్పగింత శాంతియుతంగా, స్థిరపడిన ప్రోటోకాల్‌ల ప్రకారం జరిగిందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
Previous Articleవచ్చే ఐదేళ్లలో లక్షల సంఖ్యలో ఉద్యోగ అవకాశాల కల్పనకు చర్యలు..!
Next Article జులై 4న రానున్న ‘కింగ్ డమ్’