ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని 22వ సినిమా #RAPO22 టైటిల్ ను నేడు ప్రకటించారు. నేడు రామ్ పుట్టినరోజు సందర్భంగా, ఈ సినిమాకు ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ అనే పేరును ఖరారు చేసినట్లు మూవీ టీమ్ అధికారికంగా ప్రకటించింది. పి. మహేశ్ బాబు దర్శకత్వంలో ఈమూవీ రూపొందుతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సందర్భంగా విడుదల చేసిన టైటిల్ గ్లింప్స్ ఆకట్టుకుంటోంది. ఇక ఈసినిమాలో రామ్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది. కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆయన సూర్య కుమార్ అనే సూపర్ స్టార్‌గా కనిపించనున్నారు. నవీన్ యెర్నేని, వై. రవి శంకర్ మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. సిద్ధార్థ నుని సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, వివేక్-మెర్విన్ ద్వయం సంగీతం సమకూరుస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్‌గా, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్నారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు