భారతీయ వ్యోమగామి శుభాంశు శుక్లా ‘స్పేస్ టూర్’ తేది ఖరారైంది. యాక్సియం స్పేస్ సంస్థ చేపట్టిన యాక్సియం-4 (ఏఎక్స్-4) మిషన్‌లో భాగంగా ఆయన ఈ సంవత్సరం జూన్ 8న ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ (ఐఎస్ఎస్) వైపు పయనించనున్నారు. ఈమేరకు ఈవిషయాన్ని యాక్సియం స్పేస్, నాసా సంయుక్త ప్రకటనలో ప్రకటించాయి. అయితే ముందుగా ఈ మిషన్‌ను మే 29న నిర్వహించేందుకు షెడ్యూల్ చేసినప్పటికీ, కొన్ని సాంకేతిక కారణాల వలన అది వాయిదా పడింది. దీంతో ఈప్రయోగాన్ని జూన్ లోకి జరిపేందుకు నిర్ణయించారు. మన దేశ కాలమానం ప్రకారం జూన్ 8 సాయంత్రం 6:41కి ఫ్లోరిడా లోని కెనడీ స్పేస్ సెంటర్ నుండి డ్రాగన్ స్పేస్ షిప్ లో శుభాంశు స్పేస్ లోకి దూసుకెళ్లనున్నారు. ఇక ఈ యాత్రలో అమెరికాకు చెందిన పెగ్గీ విట్సన్, పోలాండ్ కు చెందిన స్లావోస్జ్ ఉజ్నాన్స్కీ, హాంగేరీకీ చెందిన టిబర్ కపు కూడా వెళ్లనున్నారు. రెండు వారాల పాటు ఐఎస్ఎస్ లో ఉండి పరిశోధనలు చేయనున్నారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు