‘ఆపరేషన్ సిందూర్’ అనేది కేవలం ఒక పేరు మాత్రమే కాదని అదొక కమిట్మెంట్ అని రక్షణా మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. ఆయన నేడు జమ్మూ కాశ్మీర్ లో పర్యటించారు. ఈ సందర్భంగా ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతర్జాతీయ అణుశక్తి సంస్థ పాకిస్థాన్ నుండి ఆయుధాలు తీసుకుని పర్యవేక్షించాలని అన్నారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించే పాకిస్థాన్ వంటి దేశం వద్ద అణ్వాయుధాలు భద్రంగా ఉన్నాయా? అని ప్రశ్నించారు. ఉగ్రస్థావరాలు ఎక్కడ ఉన్నా ధ్వంసం చేస్తామని చెప్పారు. ఉగ్రవాదులతో పోరాడి ప్రాణత్యాగాలు చేసిన సైనికులకు శిరస్సు వంచి నివాళులు అర్పిస్తున్నట్లు పేర్కొన్నారు. భారత్ పొ ఉగ్రదాడి జరిగితే దానిని యుద్ధ చర్యగా భావిస్తానని హెచ్చరించారు. మన భద్రతా దళాలు అద్భుతంగా పోరాడుతున్నారని తెలిపారు. పహాల్గాం ఉగ్రదాడి మృతులకు నివాళులు అర్పించారు. ఇక ఈ పర్యటనలో భాగంగా ఆయన పాకిస్థాన్ షెల్లింగ్ లో దెబ్బతిన్న ప్రాంతాలను సందర్శించారు.
జమ్మూ కాశ్మీర్ లో రక్షణా మంత్రి రాజ్ నాథ్ పర్యటన: పాక్ అణ్వాయుధాల భద్రతపై కీలక వ్యాఖ్యలు
By admin1 Min Read
Previous Articleరామ్ కొత్త మూవీ టైటిల్:’ఆంధ్రా కింగ్ తాలూకా’
Next Article భారీ లాభాలతో కళకళలాడిన దేశీయ స్టాక్ మార్కెట్లు