దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు భారీ లాభాలతో ట్రేడింగ్ ముగించాయి. అంతర్జాతీయ మిశ్రమ సంకేతాలతో ఉదయం వరకు నష్టాల బాటలో పయనించిన సూచీలు మధ్యాహ్నం తర్వాత దూసుకెళ్లాయి. అమెరికా భారత్ మధ్య వాణిజ్య ఒప్పందంపై డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు మార్కెట్ కు కలిసొచ్చాయి. దీంతో భారీ లాభాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ సెన్సెక్స్ 1200 పాయింట్లు నష్టపోయి 82,530 వద్ద స్థిరపడగా… నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ నిఫ్టీ కూడా దాదాపు 395 పాయింట్ల నష్టంతో 25,062 వద్ద స్థిరపడింది. డాలర్ తో రూపాయి మారకం విలువ రూ.85.52గా కొనసాగుతోంది. సెన్సెక్స్ 30 సూచీలో టాటా మోటార్స్, హెచ్.సి.ఎల్ టెక్నాలజీస్, ఎటర్నల్, అదానీ పోర్ట్స్, మారుతీ సుజుకి షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి.
Previous Articleజమ్మూ కాశ్మీర్ లో రక్షణా మంత్రి రాజ్ నాథ్ పర్యటన: పాక్ అణ్వాయుధాల భద్రతపై కీలక వ్యాఖ్యలు
Next Article త్రివర్ణ పతాక రంగులతో కాంతులీనుతున్న చంద్రగిరి కోట