ఆపరేషన్ సిందూర్ విజయవంతం చేసిన సైనిక దళాలకు సంఘీభావంగా సీఎం చంద్రబాబు నేతృత్వంలో కూటమి నేతలు తిరంగా ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ఈ ర్యాలీలో వేలాది మంది ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బిజెపి ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి, మంత్రులు, ప్రజా ప్రతినిధులు జాతీయ పతాకాలు చేపట్టి ర్యాలీలో పాల్గొన్నారు. పాకిస్తాన్ మన దేశంలోకి వచ్చి కొడితే, మనం వాళ్ళ ఇంట్లో దూరి కొడతాం… ఇది నయా భారత్, శాంతి వచనాలు పనిచేయవు, సహనం పేరుతో ఇక చేతులు కట్టేయలేరని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ఆపరేషన్ సిందూర్ తో మన దేశ పోరాట పటిమను చాటిచెప్పిన సైనిక దళాలకు వందనం.రాష్ట్రవ్యాప్తంగా పార్టీలకు అతీతంగా సైనికులకు సంఘీభావంగా తిరంగా ర్యాలీ నిర్వహిస్తున్నారు. పహల్గాం పేరు వింటేనే ఆ విషాదం గుర్తుకొచ్చి రక్తం మరిగిపోతుంది. మనందరి గుండెల నిండా ఉన్న జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య మనవాడు కావడం గర్వకారణమని పేర్కొన్నారు.
Previous Articleక్లీన్ ఎనర్జీకి ఏపీని హబ్‌గా తీర్చిదిద్దేందుకు సంస్థలకు అవసరమైన సహాకారం అందిస్తాం: మంత్రి లోకేష్
Next Article నీరజ్ చోప్రా 90.23మీతో సరికొత్త రికార్డు