ఇంగ్లాండ్ క్రికెటర్ ఐపీఎల్ లో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు ఆటగాడు మొయిన్ అలీ ఒక ఆసక్తికరమైన విషయాన్ని తెలియజేశారు. ‘ఆపరేషన్ సింధూర్’ జరిగిన సమయంలో తన తల్లిదండ్రులు పాక్ ఆక్రమిత కశ్మీర్లోనే ఉన్నారని తెలిపాడు. ఆ సమయంలో చాలా ఆందోళనకు గురి చేశాయని అన్నాడు. ఈ మేరకు ఓ పాడ్ కాస్ట్ లో మాట్లాడుతూ ఆ రోజును గుర్తుచేసుకున్నాడు. అప్పుడు వారున్న ప్రాంతం నుండి గంట ప్రయాణ దూరంలో ఉండే ప్రాంతంలో దాడులు జరిగాయి. చూస్తుండగానే పరిస్థితులు తీవ్రంగా మారాయి. వార్ మధ్యలో చిక్కుకున్నామని వారికి అర్థమైంది. అయితే, అదృష్టవశాత్తూ వారున్నచోట ఎలాంటి దాడులు జరగలేదు. వెంటనే అందుబాటులో ఉన్న ఒక్క ఫ్లైట్ ఎక్కి వారు ఆ ప్రాంతాన్ని వీడారు. వారు క్షేమంగా బయటకు రావడంతో ఊపిరి పీల్చుకున్నట్లు మొయిన్ అలీ తెలిపాడు.
Previous Articleశాఫ్ అండర్-19 ఫుట్ బాల్ ఛాంపియన్ షిప్ లో టైటిల్ విజేత భారత్
Next Article నవంబర్ లో నంది నాటకోత్సవాలు, నంది అవార్డుల ప్రధానం