నవంబర్ లో నంది నాటకోత్సవాలు, నంది అవార్డుల ప్రధానం చేయనున్నట్లు కళా, సాంస్కృతిక రంగాలకు పునరుజ్జీవం తెస్తామని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. అంబికా సంస్థలు, హిందూ యువజన సంఘం, హేలాపురి కళాపరిషత్ ఆధ్వర్యంలో ఏలూరులోని శ్రీ మోతే గంగరాజు ప్రాంగణంలోని వైఎంహెచ్ఏ హాల్లో జరిగిన అంబికా సంస్థల వ్యవస్థాపకులు ఆలపాటి రామచంద్రరావు శతజయంతి ఉత్సవాల్లో, జాతీయ స్థాయి తెలుగు నాటక పోటీలో మంత్రి కందుల దుర్గేశ్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. త్వరలో ఏపీకి నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా.. తద్వారా కళా నాటక రంగాలకు చేయూతస్తామని పేర్కొన్నారు.రాబోయే రోజుల్లో మరిన్ని టూరిజం ఇన్వెస్టర్స్ సమ్మిట్ ల నిర్వహణ ఉంటుందని స్పష్టం చేశారు. భవిష్యత్తులో అమరావతిలో సినిమా రంగం ఎదిగేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.
Previous Article‘ఆపరేషన్ సింధూర్’ సమయంలో పీవోకే లో మొయిన్ అలీ తల్లిదండ్రులు
Next Article విడుదలైన ‘భైరవం’ ట్రైలర్