ప్రపంచంలోని పలు దేశాల్లో మళ్లీ కొవిడ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. మే నెలలోనే కేరళలో 182 కొవిడ్ కేసులు నమోదయ్యాయని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ తెలిపారు. అత్యధికంగా కొట్టాయం జిల్లాలో 57 కేసులు నమోదైనట్లు తెలిపారు. ఎర్నాకుళంలో 34, తిరువనంతపురంలో 30 కేసులు ఉన్నట్లు వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జలుబు, దగ్గు, శ్వాస సంబంధిత సమస్యలున్న వారు తప్పసరిగా మాస్క్ ధరించాలని వీణా జార్జ్ అన్నారు. మరోవైపు మహారాష్ట్రలో జనవరి నుండి ఇప్పటివరకు నమోదైన కొవిడ్ కేసుల్లో ఇద్దరు మరణించినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది. మరణించిన వారిలో ఒకరికి క్యాన్సర్ ఉన్నట్లు పేర్కొంది. జనవరి నుండి మొత్తం 6,066 స్వాబ్ టెస్ట్‌లు చేయగా, 106 కేసులు పాజిటివ్ తెలినట్లు చెప్పింది. వీరిలో 101 మంది ముంబయికి చెందిన వారు కాగా, మిగిలిన వారు పుణె, థానే, కొల్హాపుర్ చెందినవారుగా పేర్కొంది. ప్రస్తుతం రాష్ట్రంలో 52 కేసులు పాజిటివ్ కేసులు ఉన్నట్లు, వారిలో 16మంది హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతున్నట్లుగా ఆరోగ్యశాఖ పేర్కొంది. మే 19నాటికి దేశవ్యాప్తంగా 257 కొవిడ్ కేసులు ఉన్నట్లు ఇటీవల కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఈ కొవిడ్ కేసులన్నీ దాదాపుగా తేలికపాటివేనని, హాస్పిటల్ లో చేరాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. సింగపూర్, హాంకాంగ్‌లో కొవిడ్ కేసులు పెరుగుతుండడం వల్ల అప్రమత్తమైనట్లు పేర్కొంది.
Trending
- ఇంటర్నేషనల్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన కేన్ విలియమ్ సన్
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

