కరోనా కేసులు పలు దేశాల్లో పెరుగుతున్న సంగతి తెలిసిందే. భారత్ లో కూడా మళ్లీ కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమై హాస్పిటల్స్ ను సిద్ధం చేస్తున్నాయి. దేశంలో కొవిడ్ కొత్త వేరియంట్లు ఎన్బీ.1.8.1, ఎల్ఎఫ్.7లను గుర్తించినట్లు ఇండియన్ సార్స్-కోవ్-2 జీనోమిక్స్ కన్సార్టియం (ఇన్సాకాగ్) తాజాగా ప్రకటించింది. ఎన్బీ.1.8.1 రకం కేసు ఏప్రిల్ నెలలో వెలుగు చూడగా, ఎల్ఎఫ్.7 వేరియంట్ కు సంబంధించిన నాలుగు కేసులు మే నెలలో తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాల్లో నమోదైనట్లు సంస్థ తెలిపింది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు