ఏపీ డిప్యూటీ సీఎం కార్యాలయం కీలక ప్రకటన చేసింది.రాష్ట్రంలో ఎన్.డి.ఏ. కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావస్తున్నా తెలుగు సినిమా సంఘాల ప్రతినిధులు గౌరవ ముఖ్యమంత్రి గారిని మర్యాదపూర్వకంగా కలిశారా? అని ప్రశ్నించారు. తెలుగు చిత్రసీమ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ కు డిప్యూటీ సీఎం పవన్ కృతజ్ఞతలు తెలిపారు. గత ప్రభుత్వం సినిమా రంగంవారిని, అగ్ర నటులను ఎలా ఛీత్కరించిందో మరచిపోయినట్లున్నారు.ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు సినిమా రంగానికి పరిశ్రమ హోదా కల్పించి, అభివృద్ధి చేయాలని, ఈ రంగంలో ఉన్నవారి గౌరవమర్యాదలకు భంగం వాటిల్లకుండా చూస్తుంటే తెలుగు సినీ రంగంలో ఉన్నవారికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పట్ల కనీస మర్యాద, కృతజ్ఞత కనిపించడం లేదని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఇకపై ప్రభుత్వంతో వ్యక్తిగత చర్చలు ఉండవని సినిమా సంఘాల ప్రతినిధులే రావాలని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం వ్యక్తులను కాదు సినిమా రంగం అభివృద్ధినే చూస్తుందని తెలిపారు. కేవలం తమ చిత్రాల విడుదల సందర్భంలో ప్రభుత్వం ముందుకు రావడం మినహా, చిత్ర రంగం అభివృద్ధి కోసం సంఘటితంగా రాలేదు. అందరూ కలసి రావాలి అని డిప్యూటీ సీఎం పవన్ సూచించినా సానుకూలంగా స్పందించలేదని డిప్యూటీ సీఎంఓ ఆ ప్రకటనలో తెలిపింది.రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పర్యటక రంగానికి పరిశ్రమ హోదా ఇస్తూ పాలసీని ప్రకటించింది. అదే విధంగా సినిమా రంగం అభివృద్ధి కోసం ప్రత్యేక పాలసీ తీసుకురావాలని డిప్యూటీ సీఎం పవన్ ఆలోచన చేశారు. దీనిపై సీఎంతో చర్చించనున్నారు. అనంతరం కాంప్రహెన్సివ్ ఫిల్మ్ డెవలప్మెంట్ పాలసీని ప్రకటిస్తారని తెలిపింది.
తెలుగు చిత్రసీమ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ కు థ్యాంక్స్: డిప్యూటీ సీఎం పవన్
By admin1 Min Read