ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ ను భారత్ మొత్తంగా 24 మెడల్స్ సాధించి ఘనంగా ముగించింది. ఇందులో 8 గోల్డ్, 10 సిల్వర్, 6 బ్రాంజ్ మెడల్స్ ఉన్నాయి. దీంతో ఈ టోర్నీలో ద్వితీయ స్థానంలో నిలిచింది. ఈ టోర్నీ చరిత్రలో మన దేశానికి ఇది అత్యుత్తమ ప్రదర్శన. పోటీలో చివరి రోజు భారత్ 3 గోల్డ్, 3 సిల్వర్ మెడల్స్ గెలిచింది. మహిళల 4×100మీ రిలే రన్ లో నిత్య, శ్రాబని, అభినయ, స్నేహాల టీమ్ 43.86 సెకన్లలో టార్గెట్ చేరి రెండో స్థానంలో నిలిచి సిల్వర్ మెడల్ సాధించింది. మహిళల 5వేల మీ రన్ లో పారుల్ చౌదరి 15 నిమిషాల 15.33 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుని సిల్వర్ గెలిచింది. 3 వేల మీటర్ల స్టీపుల్ ఛేజ్ లో కూడా ఆమె సిల్వర్ మెడల్ సాధించింది. పరుగులో పూజా, మహిళల 400 మీ హార్డిల్స్ లో విత్య, మెన్స్ 200మీ అనిమేశ్ కుజుర్ కాంస్య పతకాలు సాధించారు. ఇక చైనా, జపాన్ లు మొత్తంగా మొదటి, మూడో స్థానాలలో నిలిచాయి.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు