ఆపరేషన్ సిందూర్ లో భారత్ తన సొంత ఆయుధాలతో నే ఉగ్రమూకలను నాశనం సంగతి తెలిసిందే. స్వదేశీ ఆయుధాలు మన శక్తిని చాటాయని, అవి వేటికీ తీసిపోవని నిరూపించాయని ప్రధాని మోడీ అన్నారు. మేక్ ఇన్ ఇండియా రక్షణ ఆయుధాలు, వాటిని తయారు చేసే సంస్థలు ప్రభుత్వ ప్రాధాన్యాంశాలని స్పష్టం చేశారు. ప్రధాని అధ్యక్షతన మంత్రి మండలి తాజాగా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆపరేషన్ సిందూర్ పై మంత్రులకు ప్రజెంటేషన్ ఇచ్చారు. మంత్రులంతా పెద్ద లక్ష్యాలను పెట్టుకుని వాటిని సాధించేందుకు కృషి చేయాలని ప్రధాని సూచించారు. మోడీ ప్రభుత్వ 11ఏళ్ల పాలనా విజయాలపై సమావేశంలో క్యాబినెట్ కార్యదర్శి ప్రజెంటేషన్ ఇచ్చారు.
మేక్ ఇన్ ఇండియా రక్షణ ఆయుధాలు, వాటిని తయారు చేసే సంస్థలు ప్రభుత్వ ప్రాధాన్యాంశాలు
By admin1 Min Read