ఇండో-పసిఫిక్ రీజియన్ లో శాంతి సుస్థిరతల కోసం పరస్పరం వ్యూహాత్మక సహకారం కోసం భారత్, ఆస్ట్రేలియాలు అంగీకరించాయి. భారత పర్యటనలో ఉన్న ఆస్ట్రేలియా ఉపప్రధాని రిచర్డ్ మార్లెస్ తాజాగా రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పహల్గాం ఉగ్రదాడికి ఘాటుగా బదులిస్తూ భారత్ చేపట్టిన చర్యలకు మద్దతు తెలిపారు. పాకిస్థాన్ మద్దతుతో సాగుతున్న ఉగ్రవాద కార్యకలాపాల నుంచి తనను తాను రక్షించుకునే హక్కు భారత్ కు ఉందని ఆస్ట్రేలియా ఉప ప్రధాని మార్లెస్ అన్నారు. భారత్ చేపట్టిన చర్య కచ్చితంగా, బాధ్యతగా, ఉద్రిక్తతలు పెరగకుండా ఉండే విధంగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఆస్ట్రేలియా రక్షణ మంత్రి కూడా అయిన మార్లెస్ తన పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిశారు. ఆ సమావేశంలో సీమాంతర ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ చేస్తున్న పోరుకు మత మద్దతు ఉంటుందని మార్లెస్ తెలిపారు. ఇరుదేశాలు రక్షణ పారిశ్రామిక రంగాల్లో కూడా సహకరించుకోవాలని అంగీకారం కుదిరినట్టు అధికారిక ప్రకటన తెలియజేసింది.
ఉగ్రవాదంపై భారత్ చేస్తున్న పోరాటానికి మద్దతు పలికిన ఆస్ట్రేలియా ఉపప్రధాని రిచర్డ్ మార్లెస్
By admin1 Min Read