ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చీనాబ్ రైల్వే బ్రిడ్జిని ఇటీవలే ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన సంగతి తెలిసిందే. 2025, జూన్ 6న చీనాబ్ రైల్వే వంతెనను ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఈ చీనాబ్ రైల్వే బ్రిడ్జి భారతీయ ఇంజనీరింగ్ సాధించిన గొప్ప విజయంగా విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. కొంచెంగా, ఎంతో ప్రతిష్టాత్మకమైన చీనాబ్ రైల్వే బ్రిడ్జి ప్రారంభోత్సవం తర్వాత ఒక మహిళ పేరు విశేషంగా వినిపిస్తోంది. ఆమే ప్రముఖ సివిల్ ఇంజనీర్ మాధవి లత. ఈ వంతెన నిర్మాణంలో ఆమె కీలక పాత్ర పోషించారు. దాదాపు 17 సంవత్సరాల పాటు ఆ వంతెన నిర్మాణం కోసం ఆమె నిర్విరామంగా కృషి చేశారు.
వంతెన నిర్మాణ ప్రారంభం నుంచి మాధవి లత వెనక్కి తగ్గకుండా ధైర్యంగా వంతెన నిర్మాణం పూర్తయ్యే వరకు ప్రాజెక్ట్ సలహాదారుగా బాధ్యతలు నిర్వర్తించారు. 2025, జూన్ 6న ఎట్టకేలకు చారిత్రాత్మకమైన చీనాబ్ వంతెన ప్రారంభం కావడంతో మాధవి లత పేరు వార్తల్లో వినిపిస్తోంది. దీంతో మాధవి లతపై ప్రశంసలు వర్షం కురుస్తోంది. గ్రేట్ ఉమెన్ అంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు సహా పలువురు ప్రముఖులు కూడా ప్రశంసలు కురిపించారు.
చీనాబ్ రైల్వే బ్రిడ్జి నిర్మాణంలో కీలకపాత్ర పోషించిన ఇంజనీర్ మాధవీలత …’గ్రేట్ ఉమెన్’ అంటూ నెటిజన్ల ప్రశంసలు
By admin1 Min Read