భారత సంతతికి చెందిన ఆస్ట్రోనాట్ సునీతా విలియమ్స్ వ్యాక్స్ స్టాట్యూ (మైనపు విగ్రహాం) వెస్ట్ బెంగాల్లోని అసన్సోల్ ఆవిష్కరించారు. సుశాంత రాయ్ అనే శిల్పి ఈ విగ్రహాన్ని రూపొందించారు. దీనిని తయారు చేయడానికి నెలన్నర సమయం పట్టినట్లు ఆయన తెలిపారు. సునీతా విలియమ్స్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో దాదాపు 9 నెలలు గడిపి, తర్వాత భూమిని చేరుకున్న సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఆమె విగ్రహాన్ని తయారుచేయాలనే ఆలోచన వచ్చినట్లు సుశాంత రాయ్ తెలిపారు. సునీత విగ్రహాన్ని సుశాంత సొంత మ్యూజియంలోనే ప్రస్తుతం ఆవిష్కరించారు.
Previous Articleఇంటర్నేషనల్ క్రికెట్ కు పూరన్ గుడ్ బై
Next Article 11 సంవత్సరాలు… ఎన్నో కీలక ఘట్టాలు