విశాఖపట్నంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహించే యోగాంధ్ర కార్యక్రమం అత్యంత కీలకమైందని మంత్రి నారా లోకేష్ అన్నారు.విశాఖ ఆంధ్రా యూనివర్సిటీలోని సాగరిక కన్వెన్షన్ హాలులో ఈనెల 21న యోగా డే నిర్వహణ ఏర్పాట్లపై అధికారులతో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆ రోజున మనం సాధించబోయే రికార్డు కోసం ప్రపంచమంతా విశాఖ మహానగరం వైపు చూస్తోందని పేర్కొన్నారు. ప్రధాని మోడీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని దిశానిర్దేశం చేశారు. ఒకే ప్రాంతంలో 5లక్షలమందితో నిర్వహించే ఈ ఈవెంట్ ప్రపంచంలోనే అతిపెద్దదిగా చరిత్ర సృష్టించబోతోంది. ప్రధాని మోడీజీ హాజరు కాబోతున్నారు, అధికారులంతా పట్టుదల, క్రమశిక్షణ, కమిట్ మెంట్ తో పకడ్బందీగా కార్యక్రమాన్ని నిర్వహించాలి. ఇది రాష్ట్రప్రజలందరి కార్యక్రమం. రాజకీయాలకు అతీతంగా అన్ని రాజకీయపక్షాలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈనెల 21న ఆర్ కె బీచ్ నుంచి భీమిలి వరకు 26 కి.మీ.ల పొడవున 247 కంపార్ట్ మెంట్లలో నిర్వహించే ఈ కార్యక్రమానికి వచ్చే ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలి. 19,20,21 తేదీలు కీలకం, అధికారులంతా ప్రణాళికాబద్ధంగా, కలసికట్టుగా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు.
ఇది రాష్ట్రప్రజలందరి కార్యక్రమం…యోగా డే నిర్వహణ ఏర్పాట్లపై మంత్రి లోకేష్ సమీక్ష
By admin1 Min Read