గుజరాత్ లోని అహ్మదాబాద్‌లో ఈరోజు మధ్యాహ్నం జరిగిన ఘోర విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ సహా వందల సంఖ్యలో ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. లండన్‌లోని గాట్విక్ నగరానికి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే కుప్పకూలి మంటల్లో చిక్కుకుంది. ఈ దుర్ఘటనలో అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డ ఓ వ్యక్తి హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. అతని సీటు నెంబర్ 11Aగా తెలుస్తోంది. ఈ దుర్ఘటనలో ప్రాణాలతో బయటపడ్డ ఆ 40 ఏళ్ల వ్యక్తి పేరు విశ్వాస్ కుమార్ రమేష్.
అహ్మదాబాద్‌లోని అసర్వాలో గల సివిల్ ఆసుపత్రి జనరల్ వార్డులో చేర్పించారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉంది.ఈ దుర్ఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళితే, ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానం, 230 మంది ప్రయాణికులు మరియు 12 మంది సిబ్బందితో కలిపి మొత్తం 242 మందితో గురువారం మధ్యాహ్నం 1:39 గంటలకు అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి గాట్విక్‌కు బయలుదేరింది. అయితే, టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే విమానం కుప్పకూలి మంటల్లో చిక్కుకుంది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు