అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమానం ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారిలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ కూడా ఉన్నారు.
ఆయన మృతిని అధికారులు అధికారికంగా ధృవీకరించారు. ఆయనతో పాటు చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఎయిర్ ఇండియా AI-171 విమాన ప్రమాదంలో వీరంతా మృతి చెందారు. ఈ ప్రమాదం ఈరోజు మధ్యాహ్నం అహ్మదాబాద్‌లో చోటు చేసుకుంది. అహ్మదాబాద్ నుండి లండన్‌కు వెళ్తున్న బోయింగ్ 787 డ్రిమ్‌లైనర్ విమానం టేక్ ఆఫ్ అయిన ఐదు నిమిషాల్లోనే మేఘని నగర్ ప్రాంతంలో కూలిపోయింది. ఇది ఒక నివాస ప్రాంతం కాగా, అక్కడ ఉన్న మెడికల్ కాలేజ్ హాస్టల్‌పై నేరుగా విమానం పడినట్లు అధికారులు తెలిపారు. విజయ్ రుపానీ గుజరాత్ కి 16వ ముఖ్యమంత్రిగా పనిచేశారు. 1956 ఆగస్ట్ 2న విజయ్ రుపానీ జన్మించారు. బీజేపీలో సీనియర్ నేత. రెండుసార్లు సీఎంగా పనిచేశారు. 2016 నుంచి 2021 వరకు సుమారు ఐదేళ్ల పాటు ఆయన సీఎంగా బాధ్యతలు నిర్వహించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో రాజ్ కోట్ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలుపొందారు.
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ
By admin1 Min Read