ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో ఘటనాస్థలాన్ని ప్రధాని నరేంద్ర మోడీ నేడు పరిశీలించారు. అహ్మదాబాద్ నుండి లండన్ కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం నిన్న మధ్యాహ్నం బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ పై కూలిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఒకరు మినహా 241 మంది మరణించారు. గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ కూడా మరణించిన వారిలో ఉన్నారు. మెడికల్ కాలేజీ హాస్టల్ పై కూలడంతో అందులో ఉన్న 24 మంది మరణించారు. దీంతో మొత్తం ఈ దుర్ఘటనలో 265 మంది మరణించారు. ఇక ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని మోడీ నేడు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. ఆయనతో పాటు గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఇతర అధికారులు ఉన్నారు. ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అహ్మదాబాద్ సివిల్ హాస్పిటల్ కు చేరుకుని ప్రమాదంలో గాయపడిన వారిని పరామర్శించారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు