టెండూల్కర్-అండర్సన్ ట్రోఫీలో భాగంగా లీడ్స్ వేదికగా జరిగిన భారత్-ఇంగ్లాండ్ మొదటి టెస్టులో ఎంత బాగా ఆడినప్పటికీ భారత్ కు పరాజయం తప్పలేదు. ఐదో రోజు పూర్తిగా ఆధిపత్యం కనబరిచిన ఇంగ్లాండ్ భారత్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని 5 వికెట్ల తేడాతో గెలిచి ఈ సిరీస్ ను విజయం తో ప్రారంభించింది. ఇక ఈ మ్యాచ్ లో మొదటి ఇన్నింగ్స్ లో భారత్ 471 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ 465 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్ లో భారత్ 364 పరుగులు చేసింది. మొదటి ఇన్నింగ్స్ లో 6 పరుగుల ఆధిక్యం కలిపి ఇంగ్లాండ్ విజయ లక్ష్యం 371 పరుగులు కాగా, ఓవర్ నైట్ స్కోరు 21-0తో ఐదో రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లాండ్ జట్టులో డకెట్ 149 (170; 21×4, 1×6) భారీ సెంచరీతో రాణించాడు.క్రాలీ 65 (126; 7×4), జో రూట్ 53 (84; 6×4) హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్నారు. స్మిత్ 44 నాటౌట్, స్టోక్స్ (33) పరుగులు చేయడంతో సులభంగా లక్ష్యాన్ని ఛేదించింది. భారత బౌలర్లలో ప్రసీద్ కృష్ణ 2 వికెట్లు, శార్దుల్ ఠాకూర్ 2 వికెట్లు పడగొట్టారు. జడేజా 1 వికెట్ తీశాడు. ఈ మ్యాచ్ విజయంతో ఇంగ్లాండ్ 1-0 ఆధిక్యంలో నిలిచింది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు