ఎలాన్ మస్క్ ట్విట్టర్ ను కొనుగోలు చేసిన తర్వాత దాని పేరును ఎక్స్ గా మార్చిన విషయం తెలిసిందే. ఇక అప్పటి వరకు ఉచితంగా ఉన్న ట్విట్టర్ బ్లూ టిక్ ఎకౌంట్ లను పెయిడ్ సబ్ స్క్రిప్షన్ ను తీసుకొచ్చారు. ఈ పెయిడ్ సబ్ స్క్రిప్షన్ తో మన దేశంలో అనేక మంది ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో మస్క్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సబ్ స్క్రిప్షన్ ధరలను భారీగా తగ్గించారు. తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం నెలకు రూ. 5,130గా ఉన్న ప్రీమియం ప్లస్ సబ్ స్క్రిప్షన్ ధర రూ. 3 వేలకు అందుబాటులోకి రానుంది. రూ. 900గా ఉన్న ప్రీమియం సబ్ స్క్రిప్షన్ ధర రూ. 470కి తగ్గనుంది.యాప్ వర్షన్ లో బేసిక్ ప్లాన్ నెలకు రూ. 244గా ఉన్న ధర రూ. 170కి… ప్రీమియం రూ. 650 నుంచి రూ. 427కి… ప్రీమియం ప్లస్ రూ. 3,470 నుంచి రూ. 2,570కి తగ్గనున్నట్లు తెలుస్తోంది.
Previous Articleజీఎస్టీ వసూళ్లలో ఏపీ రోల్ మోడల్ గా ఉండాలి: ఏపీ సీఎం చంద్రబాబు
Next Article ఏపీలోని నగరాలకు స్వచ్ఛసర్వేక్షణ్ అవార్డులు