ఆర్టీజీఎస్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే ముందు హెచ్చరికలు… ఆ తర్వాతే పెనాల్టీలని పేర్కొన్నారు. అనుమానితులపై నిఘా పెట్టాలని సూచించారు. నేరాలను కట్టడి చేయాలని ఆదేశించారు. సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. సాంకేతికతను అందించడమే కాదు… అర్థమయ్యేలా చెప్పాలని అన్నారు. ఆర్టీజీఎస్ డేటానే అన్ని శాఖలకు ప్రామాణికమని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ డ్రోన్ మార్ట్ పోర్టల్ ను ఏపీ సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ పోర్టల్ ద్వారా వివిధ రకాల డ్రోన్ సేవలను ఏపీ డ్రోన్స్ కార్పోరేషన్ ప్రభుత్వం అందించనుంది . వ్యవసాయం, ఇన్ఫ్రా, విపత్తు నిర్వహణ వంటి అంశాల్లో డ్రోన్ సేవలు దోహాదం చేయనున్నాయి.
Previous Articleలార్డ్స్ టెస్టులో భారత్ పరాజయం… పోరాడిన జడేజా
Next Article ఇది ఏపీలో ఉన్నత విద్యను సమూలంగా మార్చే నిర్ణయం