భారతీయ నర్సు నిమిష ప్రియ మరణశిక్ష వాయిదా పడింది.యెమెన్ అధికారులు శిక్షను వాయిదా వేశారు. తనను వేధిస్తున్న వ్యక్తిని హత్య చేసినందుకు గాను కేరళకు చెందిన ఈ నర్సుకు యెమెన్ అధికారులు ఉరిశిక్ష విధించిన సంగతి తెలిసిందే. రేపు ఈ శిక్షను అమలు చేయాల్సి ఉండగా, భారత అధికారులు యెమెన్ అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె మరణశిక్ష అమలును యెమెన్ వాయిదా వేసినట్లు భారత విదేశాంగ వర్గాలు తెలిపాయి.
నిమిష ప్రియ ఉరిశిక్షను ఆపేందుకు భారత ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోంది. ఈ విషయంలో భారత ప్రభుత్వం నిమిష కుటుంబానికి తగిన సాయం అందిస్తోంది. మృతుడి కుటుంబంతో నిమిష ప్రియ కుటుంబం చర్చల కోసం మరింత గడువు కావాలని భారత్ బలంగా కోరింది. ఈ నేపథ్యంలో చివరి నిమిషంలో మరణశిక్ష అమలు వాయిదా పడింది. నిమిష ప్రియకు అన్ని విధాలా సాయం చేసేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నిస్తూనే ఉందని విదేశాంగ శాఖ వర్గాలు తెలిపాయి.
నిమిష ప్రియ మరణశిక్ష వాయిదా… రక్షించేందుకు కృషి చేస్తున్న భారత ప్రభుత్వం
By admin1 Min Read