క్రీడాంధ్రప్రదేశ్ దిశగా మరో అడుగు పడింది. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ( APL) సీజన్ – 4… గ్రామీణ క్రీడాకారులకు మెరుగైన అవకాశాలు కల్పించే వేదికగా నిలిచింది. తాజాగా విశాఖలో జరిగిన వేలంలో అమరావతి రాయల్స్ తరపున కోరుకొండ బుద్ధరాం దుర్గేష్ నాయుడు ఎంపికయ్యారు. దీనిపై ఏపీ మంత్రి నారా లోకేష్ స్పందించారు. దుర్గేష్ కు అభినందనలు తెలిపారు. సింహాచలంలో నివసిస్తున్న నిరుపేద కుటుంబానికి చెందిన నాయుడు కెరీర్ లో 4సెంచరీలు, 6 అర్థ సెంచరీలు సాధించి క్రికెట్ లో ప్రతిభ కనబర్చాడు. నాయుడు మరింత ఉన్నత స్థానాలకు చేరుకోవాలని మనస్పూర్తిగా ఆకాంక్షిస్తున్నట్లు లోకేష్ పేర్కొన్నారు. ఆలాగే మంగళగిరికి చెందిన కేపీ సాయి రాహుల్ కాకినాడ కింగ్స్ తరపున ఎంపిక కావడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ప్రతిభ గల క్రీడాకారులను గుర్తించేందుకు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ చేస్తున్న కృషి ప్రశంసనీయం. సాయి రాహుల్ క్రికెట్ కెరీర్ కు అవసరమైన అన్ని సహాయ, సహకారాలు అందిస్తామని చెప్పారు.
విశాఖలో జరిగిన ఏపిఎల్ సీజన్ – 4 వేలంలో మంగళగిరికి చెందిన కేపీ సాయి రాహుల్ కాకినాడ కింగ్స్ తరపున ఎంపిక కావడం ఆనందంగా ఉంది. ప్రతిభ గల క్రీడాకారులను గుర్తించేందుకు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ చేస్తున్న కృషి ప్రశంసనీయం. సాయి రాహుల్ క్రికెట్ కెరీర్ కు అవసరమైన అన్ని సహాయ, సహకారాలు… pic.twitter.com/RfQdZasWlb
— Lokesh Nara (@naralokesh) July 14, 2025