టెండూల్కర్ అండర్సన్ ట్రోఫీలో భాగంగా మాంచెస్టర్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్ లో 669 పరుగుల భారీ స్కోరు చేసింది. దీంతో 331 పరుగుల ఆధిక్యాన్ని భారత్ ముందుంచింది. ఇంగ్లాండ్ బ్యాటర్లలో జో రూట్ 150 (248; 14×4), బెన్ స్టోక్స్ 141 (198; 11×4, 3×6) భారీ సెంచరీలతో చెలరేగారు. బెన్ డకెట్ 94 (100; 13×4), క్రాలీ 84 (113; 13×4, 1×6), ఓలీ పోప్ 71 (128; 7×4) హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్నారు. కార్సే (47) కూడా పర్వాలేదనిపించారు. ఇక భారత బౌలర్లలో జడేజా 4 వికెట్లు, బుమ్రా2, వాషింగ్టన్ సుందర్ 2, కాంబోజ్, సిరాజ్ ఒక్కో వికెట్ చొప్పున పడగొట్టారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్లు కోల్పోయి 174 పరుగులతో ఉంది. యశస్వీ జైశ్వాల్ (0), సాయి సుదర్శన్ (0) వికెట్లను త్వరగా కోల్పోయినప్పటికీ శుభ్ మాన్ గిల్ 78 నాటౌట్, కే.ఎల్.రాహుల్ 87 నాటౌట్ మరో వికెట్ పడకుండా సమర్థవంతంగా ఆడుతూ భారత్ ఇన్నింగ్స్ ను గాడిలో పెట్టారు. ప్రస్తుతం భారత్ 137 పరుగుల వెనుకంజలో ఉంది. ఐదో రోజు వికెట్లు పడకుండా కాపాడుకోగలిగితే మ్యాచ్ ను డ్రా చేసుకోవచ్చు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు