ప్రధాని నరేంద్ర మోడీ తమిళనాడు పర్యటనలో భాగంగా దక్షిణ భారతదేశంలో అతి పెద్ద శివాలయాల్లో ఒకటైన గంగైకొండ చోళపురం ఆలయాన్ని సందర్శించుకున్నారు. మాల్దీవుల పర్యటన పూర్తి చేసుకున్న ప్రధాని నిన్న రాత్రి తమిళనాడు లోని తూతుక్కుడి ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు. నేడు ఆలయాన్ని దర్శించుకున్నారు. సంప్రదాయ వస్త్రాలతో స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ పూజారులు ప్రధానికి ఘనస్వాగతం పలికారు. స్వామి వారికి ప్రధాని హారతి ఇచ్చారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆది తిరువత్తరై ఉత్సవాల్లో ప్రధాని పాల్గొన్నారు.
తమిళనాడు పర్యటనలో భాగంగా ప్రధాని అంతర్జాతీయ ప్రమాణాలతో రూ.450 కోట్లతో విస్తరించిన కొత్త టెర్మినల్ ను ప్రారంభించారు. రాష్ట్రంలో రూ.4,900 కోట్లతో పూర్తి చేసిన వివిధ రోడ్, రైల్వే మార్గాలను జాతికి అంకితం చేశారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు