భారత్, రష్యా సంబంధాలపై ఇటీవల అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలతో కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సమర్థించడాన్ని సొంత పార్టీకి చెందిన ఎంపీ శశిథరూర్ విభేదించారు. రాహుల్ వ్యాఖ్యలతో తాను విభేదిస్తున్నట్లు థరూర్ స్పష్టం చేశారు. భారత్, రష్యా ఆర్థిక వ్యవస్థలు ఇప్పటికే పతనమయ్యాయని, వాటిని మరింత దిగజార్చుకోనీయండంటూ ఇటీవల ట్రంప్ వ్యాఖ్యాలు చేశారు. ట్రంప్ విమర్శలను శశిథరూర్ కొట్టిపారేశారు. భారత ఆర్థిక స్థితి ఎలా ఉందో అందరికీ తెలుసన్నారు. ట్రంప్ వ్యాఖ్యాలను రాహుల్ సమర్థించడంపై పార్లమెంట్ బయట మీడియా ప్రశ్నించగా ఈ మేరకు స్పందించారు.
రష్యాతో భారత్ ఏం చేస్తుందన్న విషయాన్ని అసలు పట్టించుకోబోమని, వారిద్దరూ మునిగిపోతుంటే మాకెందుకని, మిగిలిన అందరి గురించి పట్టించుకుంటామని ట్రంప్ పోస్టు చేసిన విషయం తెలిసిందే. ట్రంప్ వ్యాఖ్యాలను రాహుల్ గాంధీ సమర్థించారు. భారత ఆర్థిక వ్యవస్థ పతనమైందంటూ ట్రంప్ నిజం మాట్లాడారని అన్నారు. దీనిపై అధికార పక్షం నుంచే కాకుండా దేశవ్యాప్తంగా ప్రజల నుంచి కూడా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
భారత్ తో మంచి సంబంధాలున్నప్పటికీ.. ఆ దేశంతో స్వల్ప లావాదేవీలే ఉన్నాయి. ఆ దేశం విధిస్తున్న సుంకాలు ప్రపంచంలోనే అత్యధికంగా ఉన్నాయి. ఉక్రెయిన్ లో దాడులు ఆపాలని ప్రపంచమంతా నినదిస్తుంటే భారత్ మాత్రం రష్యా నుండి ఆయుధాలను, ఇంధనాన్ని కొనుగోలు చేస్తోందని ట్రంప్ అక్కసు వెళ్లగక్కారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు