దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది రైతులకు ‘పీఎం కిసాన్ సమ్మాన్ నిధి’ పథకంలో భాగంగా 20వ విడత ఆర్థిక సాయాన్ని నేడు ప్రధాని మోడీ విడుదల చేశారు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ పర్యటనలో ఉన్న ప్రధాని, వారణాసిలో జరిగిన ఓ కార్యక్రమంలో బటన్ నొక్కి నిధులను రైతుల ఖాతాల్లోకి ట్రాన్స్ఫర్ చేశారు. ఈ విడతలో భాగంగా సుమారు 9.7 కోట్ల మంది అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా రూ.20,500 కోట్లు జమ అయ్యాయి.
అన్నదాతలకు పంట పెట్టుబడి ఖర్చుల భారాన్ని తగ్గించే లక్ష్యంతో కేంద్రం ఈ పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. దానిలో భాగంగా ఏటా రూ.6,000 చొప్పున ఆర్థిక సాయాన్ని అందిస్తోంది. ఈ మొత్తాన్ని మూడు వాయిదాల్లో, అంటే ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రూ.2,000 చొప్పున నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. తాజాగా విడుదల చేసిన నిధులతో అన్నదాతలకు వ్యవసాయ పనుల కోసం కీలకమైన పెట్టుబడి సాయం అందినట్లయింది.
Trending
- ఇంటర్నేషనల్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన కేన్ విలియమ్ సన్
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

