జాతీయ రహదారుల శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమం తాజాగా జరిగింది. ఈ కార్యక్రమంలో కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇతర నాయకులు, అధికారులు పాల్గొన్నారు.కేంద్ర మంత్రి గడ్కరీ గారిని రోడ్డు ప్రాజెక్టుల కోసం రూ.85 వేల కోట్లు అడిగాం. ఆయన మనకు రూ.లక్ష కోట్ల విలువైన ప్రాజెక్టులకు హామీ ఇచ్చారని సీఎం చంద్రబాబు అన్నారు. గడ్కరీ ఏపీకి ఎంతో చేశారు. ఏపీని సొంత రాష్ట్రంగా భావించి మరిన్ని నిధులు, మరిన్ని ప్రాజెక్టులు మంజూరు చేయాలని కోరారు. అమరావతికి 189 కిలోమీటర్ల అవుటర్ రింగ్ రోడ్డు మంజూరు చేయాలని కోరాం. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుతో దేశంలో ప్రధాన ప్రాంతాలకు కనెక్టివిటీ మరింత మెరుగుపడుతుందని చంద్రబాబు అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం దేశ పురోగతిలో పోషించిన ప్రముఖ పాత్ర, మన ఆంధ్ర ప్రదేశ్ కు అందిస్తున్న తోడ్పాటు గురించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. ఇదే రీతిలో రాష్ట్రం అభివృద్ధి పథాన ముందుకు సాగాలి అంటే కనీసం మరో 15 ఏళ్ళు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండాలని, దానికి అనుగుణంగా కూటమి పార్టీల నాయకులు ప్రజలకు చేరువగా విభేదాలకు, వివాదాలకు దూరంగా ఉండాలని కోరారు.
జాతీయ రహదారుల శంకుస్థాపన, ప్రారంభోత్సవం… పాల్గొన్న కేంద్ర మంత్రి గడ్కరీ, ఏపీ సీఎం, డిప్యూటీ సీఎం
By admin1 Min Read