భారత తపాలా శాఖ (ఇండియా పోస్ట్) తన 50 ఏళ్లకు పైగా కొనసాగిన రిజిస్టర్డ్ పోస్ట్ సేవలను సెప్టెంబర్ 1, 2025 నుంచి పూర్తిగా మూసివేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. దాదాపు కొన్ని తరాలకు ఈ సర్వీసు ఒక భావోద్వేగం. ఇదివరకటి తరం ప్రజల జీవితాల్లో ఇదొక అంతర్భాగంగా ఇన్నేళ్లు కొనసాగింది. రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా ఉద్యోగ ఆఫర్లు, లీగల్ నోటీసులు, ప్రభుత్వ నోటిఫికేషన్ లు లేదా సమాచార లేఖలను వారి ఇళ్లకు పోస్ట్ మ్యాన్ అందించేవాడు. ఎందరి జీవితాల్లోనో ఎన్నో భావోద్వేగాలకు ఒక మాధ్యమంగా నిలిచిన ఈ సర్వీసు ఇక గతం కానుంది. ప్రైవేట్ కొరియర్ యాప్లు, ప్రస్తుతం నడుస్తున్న ట్రక్కింగ్ సేవలను ఉపయోగించే నేటి తరానికి ఇది కొత్తగా అనిపించినా ఒకప్పటి తరానికి దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఈ సేవను ఇకపై అందించకుండ, దానిని స్పీడ్ పోస్ట్ సేవలలో విలీనం చేయాలని నిర్ణయించింది. డిజిటల్ యుగంలో మారుతున్న అవసరాలు, వినియోగదారుల ప్రాధాన్యతలు, తగ్గిన డిమాండ్ వాటిని పరిగణలోకి తీసుకొని ఈ నిర్ణయానికి వచ్చినట్లు పేర్కొంది. ఈ మార్పు సెప్టెంబర్ 1, 2025 నుండి అమలులోకి వస్తుంది. రిజిస్టర్డ్ పోస్ట్, స్పీడ్ పోస్ట్ రెండింటినీ ఒకే సేవగా మార్చడం ద్వారా, కార్యకలాపాలు సులభతరం అవుతాయి. అదే విధంగా స్పీడ్ పోస్ట్ ప్రస్తుతం మెరుగైన ట్రాకింగ్ సౌకర్యాలను అందిస్తోంది, ఇది కస్టమర్లకు మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. ఈ మార్పుతో, వినియోగదారులు ఇకపై రిజిస్టర్డ్ పోస్ట్ కోసం ప్రత్యేకంగా దరఖాస్తు చేయనవసరం లేదు, బదులుగా స్పీడ్ పోస్ట్ ద్వారా పంపవచ్చు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు