ఇటీవల 20% ఇథనాల్ కలిపిన పెట్రోల్ సురక్షితం కాదంటూ కొన్ని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.ఈ ఇంధనం పాత వాహనాల సామర్థ్యాన్ని తగ్గిస్తుందా..? డ్రైవింగ్‌ను దెబ్బతీస్తుందా..? అంటూ పెట్టిన ఓ పోస్టు ఇంటర్నెట్ లో చక్కర్లు కొట్టిన నేపధ్యంలో దీనిపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈనేపథ్యంలో తాజాగా కేంద్ర ప్రభుత్వం స్పందించింది. పెట్రోలియం, నేచురల్ గ్యాస్ మంత్రిత్వశాఖ వివరణాత్మక స్పష్టత ఇచ్చింది. అవి నిరాధారమైనవని వివరించింది. సైంటిఫిక్ ప్రూఫ్స్, నిపుణుల విశ్లేషణకు అనుగుణంగా లేవని తెలిపింది. ఇథనాల్ కలిసిన పెట్రోల్ తో ఎలాంటి ఇంజిన్ సమస్యలు ఉండవని మంత్రిత్వశాఖ తెలిపింది. ఇథనాల్ వల్ల కార్బన్ ఎమిషన్స్ తగ్గుతాయని, గ్రామీణ ఆర్థికవ్యవస్థ మెరుగు పడుతుందని వ్యాఖ్యానించింది. పెట్రోల్ తో పోలిస్తే ఇథనాల్ ఎనర్జీ డెన్సిటీ తక్కువగా ఉంటుంది. దానివల్ల మైలేజీలో తగ్గుదల ఉన్నప్పటికీ.. అది చాలా తక్కువేనని తెలిపింది. కి.మీ. మేర సంప్రదాయ, ఇ20 ఇంధనం నింపిన వాహనాలకు జరిపిన పరీక్షలో పవర్, టార్క్, ఇంధన కెపాసిటీలో గణనీయమైన తేడాలు కనిపించలేదని పేర్కొంది. ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పరిశీలనల్లో ఈ మిశ్రమ ఇంధనంతో ఇంజిన్ దెబ్బతిన్న సంకేతాలు లేవని పేర్కొంది.
ఇథనాల్ కలిపిన పెట్రోల్ తో ఎలాంటి సమస్యలు ఉండవు: కేంద్రం స్పష్టత
By admin1 Min Read