రాష్ట్రంలో చేనేత కార్మికుల సంక్షేమం కోసం ఈ నెల 7వ తేదీ (జాతీయ చేనేత దినోత్సవం) నుంచి అమలు చేయాల్సిన కార్యక్రమాలపై ఏపీ సీఎం చంద్రబాబు నేడు సమీక్ష నిర్వహించారు. చేతి మగ్గాలకు 200 యూనిట్లు, పవర్ లూమ్స్ కు 500 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్, ఎన్నికల హామీ ప్రకారం చేనేత వస్త్రాలపై విధించే జీఎస్టీని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించడం ,రూ.5 కోట్లతో నేతన్నలకు త్రిఫ్ట్ ఫండ్ ఏర్పాటు అంశాలపై తగిన ఆదేశాలిచ్చారు. ఏపీకి చెందిన చేనేత ఉత్పత్తులకు 10 జాతీయ అవార్డులు రాగా వన్ డిస్ట్రిక్..వన్ ప్రొడక్ట్ విభాగంలో మొదటిసారి అవార్డు దక్కింది. ఈ అవార్డులను అధికారులు సీఎంకు చూపించారు.
జాతీయ చేనేత దినోత్సవం నుంచి అమలు చేయాల్సిన కార్యక్రమాలపై ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష
By admin1 Min Read