ఉత్తరాఖండ్ లోని ఉత్తరకాశీలో వరదలు బీభత్సం సృష్టించాయి. అక్కడి ధరాలీ గ్రామం వరదధాటికి అతలాకుతలమైంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కుంభవృష్టి కారణంగా ఎగువ ప్రాంతమైన ఖీర్ ఢ్ నుంచి మెరుపు వరదలు సంభవించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే ఎస్ఆర్ఎఫ్ రెస్క్యూ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. సహాయక చర్యల కోసం ఉత్తరాఖండ్ ప్రభుత్వం భారత సైన్యాన్ని అలెర్ట్ చేసింది. ఘటనపై సీఎం ధామి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పరిస్థితుల గురించి కేంద్రమంత్రి అమిత్ షా ఆరా తీశారు. ప్రధాని మోడీ బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు. అన్ని విధాలుగా అండగా ఉంటామని పేర్కొన్నారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు