కొన్ని పేలవ ప్రదర్శనలతో ఇబ్బంది పడినా తరువాత పుంజుకుని ఇంగ్లాండ్ లో జరిగిన టెస్ట్ సిరీస్ ను సమం చేసుకుని అభిమానులను ఆనందంలో నింపింది భారత క్రికెట్ జట్టు. సూపర్ స్టార్స్ నిష్క్రమించినా కొత్త తరం ఆటగాళ్లతో కొత్త సవాళ్లను అధిగమించి అదరగొట్టింది నయా భారత్. దీని వెనుక కోచ్ గంభీర్ కృషి కూడా ఎంతో ఉంది. కష్టపడడం…మెరుగవడం అనే లక్షణాలతో కూడిన బలమైన జట్టు సంస్కృతిని నిర్మించడం అత్యంత కీలకమైన విషయమని గంభీర్ అన్నాడు. ఇంగ్లాండ్ తో 5వ టెస్టులో గెలిచిన తర్వాత ఆటగాళ్లతో మాట్లాడుతూ సిరీస్ ను 2-2తో ముగించడం అద్భుతమైనదని ఆటగాళ్లందరికీ అభినందనలు తెలిపాడు. మనం మరింత మెరుగవుతూ కష్టపడుతూనే ఉంటాం. క్రమం తప్పకుండా మెరుగవుతుంటే సుదీర్ఘ కాలం క్రికెట్లో ఆధిపత్యం కనబరచవచ్చు. సిబ్బంది, ఆటగాళ్లు వస్తుంటారు.. పోతుంటారు. కానీ జట్టు సంస్కృతి ఎల్లప్పుడూ అలాగే ఉండాలి. ఇందులో భాగం కావాలని ఆటగాళ్లు కోరుకోవాలి. మనం సృష్టించాలనుకునేది అదేనని గంభీర్ సందేశాన్ని అందించాడు. ఈ సందర్భంగా సిరీస్ లో రాణించిన వాషింగ్టన్ సుందర్ కు ‘ఇంపాక్ట్ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్” అవార్డును బహూకరించారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు