రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తుందనే అంశంపై భారత్ పై అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ ల హెచ్చరికలను తీవ్రతరం చేసిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ అజిత్ దోవల్ రష్యా పర్యటనకు వెళ్లారు. ఆయన పర్యటన ముందుగానే ఖరారైందని అధికారిక వర్గాలు తెలిపాయి. అయితే, భారత్- రష్యా సంబంధాలపై ట్రంప్ ఇటీవల కీలక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఈ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. మాస్కోతో రక్షణ, ఇంధన సంబంధాల బలోపేతమే ఈ పర్యటన ముఖ్య లక్ష్యంగా తెలిపాయి. రష్యా చమురు సరఫరాలు, పరిశ్రమల సహకారం వంటి వాటితో పాటు మరిన్ని ఎస్-400 క్షిపణి వ్యవస్థలు, రష్యాకు చెందిన ఎస్యూ-57 యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించిన కీలక అంశాలపై మాస్కో అధికారుల అజిత్ దోవల్ తో చర్చలు జరిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Previous Articleకష్టపడతాం…మెరుగవుతాం…జట్టు సంస్కృతే ముఖ్యం ..!
Next Article ‘డేవిడ్ రెడ్డి’ గా పవర్ ఫుల్ పాత్రలో మంచు మనోజ్