అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ ల పెంపుతో మిగిలిన అతిపెద్ద ఎకానమీస్ చేతులు కలిపే దిశగా అడుగులు పడుతున్నాయి. రెండు అతిపెద్ద ఎకానమీలైన భారత్, చైనా మధ్య సంబంధాల విషయంలో తాజాగా ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. 2020లో గల్వాన్ ఘర్షణల తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తొలిసారిగా చైనాలో పర్యటించనున్నారు. ఈ నెలాఖరులో టియాంజిన్ నగరంలో జరగనున్న షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు వస్తున్న ప్రధాని మోడీకి స్వాగతం పలుకుతున్నట్లు చైనా నేడు అధికారికంగా ప్రకటించింది. ఈ ఆగస్టు 31, సెప్టెంబర్ 1 తేదీల్లో టియాంజిన్‌లో ఎస్సీఓ సదస్సు జరగనుంది. ఈ సమావేశానికి భారత ప్రధాని మోడీ వస్తున్న విషయాన్ని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి గువో జియాకున్ బీజింగ్‌లో జరిగిన మీడియా సమావేశంలో ధృవీకరించారు.
ఎస్సీఓ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోడీకి చైనా ఆహ్వానం
By admin1 Min Read
Previous Articleసంపాదనతో కలగని తృప్తి సాయంతో కలుగుతుంది: ఏపీ సీఎం చంద్రబాబు
Next Article వారాన్ని నష్టాలతో ముగించిన దేశీయ స్టాక్ మార్కెట్లు