అగ్ర కధానాయకుడు మహేష్ బాబు హీరోగా గ్రాండీయర్ దర్శకుడు రాజమౌళి కాంబినేషన్ లో రానున్న సినిమా నుంచి మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా నేడు అప్డేట్ ను అందించారు. మహేశ్ ప్రీలుక్ ఫొటోను రాజమౌళి పంచుకున్నారు. దీని పూర్తి లుక్ ను నవంబర్ లో రివీల్ చేస్తామని చెప్పారు. “మేం ఈ సినిమా నేడు ఈ సూపర్ స్టార్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి అప్డేట్ పంచుకుంటారని ఫ్యాన్స్ భావించారు. వారిని ఉద్దేశిస్తూ రాజమౌళి ఇటీవలే ఈసినిమా ప్రారంభించాం. దీనిపై మీ అందరి ఆసక్తి చూసి ఎంతో సంతోషంగా ఉంది. ఈసినిమా చాలా భారీస్థాయిలో రానుంది. కేవలం ప్రెస్మీట్ పెట్టి లేదా కొన్ని ఇమేజ్ లు విడుదల చేయడం వల్ల స్టోరీకి పూర్తిస్థాయిలో న్యాయం చేయలేము. దీన్ని భారీఎత్తున రూపొందిస్తున్నాం. ఈ ఏడాది నవంబర్ మహేశ్ లుక్ ను విడుదల చేస్తాం. గతంలో ఎప్పుడూ చూడనివిధంగా దీన్ని రూపొందిస్తున్నాం. మీరంతా సహకరిస్తారని ఆశిస్తున్నామని పేర్కొన్నారు.
For all the admirers of my #GlobeTrotter… pic.twitter.com/c4vNXYKrL9
— rajamouli ss (@ssrajamouli) August 9, 2025