బెంగళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ ఆపరేషన్ సింధూర్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ కు చెందిన 5 ఫైటర్ జెట్లను కూల్చేశామని ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ తెలిపారు. వాటితో పాటు ఓ భారీ ‘ఎయిర్ బర్నీ ఎర్లీ వార్నింగ్ అండ్ కంట్రోల్ ఎయిర్ క్రాఫ్ట్’ను కూడా కూల్చేశామన్నారు. ‘S 400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ సాయంతో 5 పాకిస్తాన్ జెట్లను పేల్చేశాం.
రెండు ఎయిర్ బేస్ లు ధ్వంసం చేశాం. మే 9, 10 తేదీల్లో ఆపరేషన్ సిందూర్ నిర్వహించాం. మే 9వ తేదీ రాత్రి ఎక్కువగా పాక్ ఉగ్ర శిబిరాలపై దాడులు చేశాం. డ్రోన్, ఎస్ 400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ బాగా పనిచేసింది. వారి యుద్ధ విమానాలు భారత గగనతలంలోకి ప్రవేశించకుండా అడ్డుకున్నాం. వాటిని ఎంతో సమర్థవంతంగా కూల్చిపడేశాం. ఆపరేషన్ సింధూర్‌తో పాక్‌కు స్పష్టమైన సందేశమిచ్చామని ఆయన పేర్కొన్నారు.
పాకిస్తాన్ కు చెందిన 5 ఫైటర్ జెట్లను కూల్చిపడేశాం:ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్
By admin1 Min Read