తుళ్లూరు గ్రామంలో బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ శంకుస్థాపన పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే, హాస్పిటల్ చైర్మన్ నందమూరి బాలకృష్ణ పాల్గొన్నారు. భూమి పూజ చేశారు.ఈ హాస్పిటల్ ను 21 ఎకరాల్లో నిర్మిస్తున్నారు. తొలి దశలో రూ.750 కోట్ల తో 500 పడకల సామర్థ్యంతో అత్యాధునిక వైద్య పరికరాల ఏర్పాటుతో నిర్మాణం జరగనుంది. మొదటి విడత పనులు 2028 నాటికి పూర్తి చేసి వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురానున్నట్లు బాలకృష్ణ తెలిపారు. డాక్టర్ నోరి దత్తాత్రేయుడు, నారా బ్రాహ్మణి, అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు , ఎంపీ కేశినేని శివనాథ్, మంత్రులు నారాయణ, సత్య కుమార్ యాదవ్, ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అమరావతి రాజధాని ప్రాంతంలో ఈ క్యాన్సర్ హాస్పిటల్ అందుబాటులోకి రావడం వల్ల క్యాన్సర్ చికిత్సలో నాణ్యమైన సేవలను అందించేందుకు మెరుగైన వైద్య సదుపాయాలు, పరిశోధనల విస్తరణకు ఈ సంస్థ ఏర్పాటు ఉపయోగపడుతుంది. అందుబాటు ధరల్లో కేన్సర్ చికిత్స రాష్ట్ర ప్రజలకు చేరువ అవుతుంది.
Previous Articleఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ గా భారత టెస్టు కెప్టెన్ శుభ్ మాన్ గిల్
Next Article ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో భారత క్రికెటర్ల హావా..!