78 సంవత్సరాల క్రితం రేగిన విభజన గాయాలను భారత్ ఇప్పటికీ తలచుకుంటూనే ఉంది. అప్పటి ఘర్షణల కారణంగా లక్షల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఎందరి జీవితాల్లోనో చీకటి అధ్యాయంగా ప్రపంచ చరిత్రలో రక్తాక్షరాలతో లిఖించబడింది. ఆగష్టు 15న స్వాతంత్ర్యం సాధించినా దానికి ఒక్కరోజు ముందు జరిగిన ఘటనలు ఇప్పటికీ దేశ చరిత్రలో చీకటి ఘట్టాలుగా మిగిలిపోయాయి. 1947 ఆగస్టు 14న మన దేశం మతాధారంగా భారత్ మరియు పాకిస్తాన్‌గా విభజించబడింది. ఈ విభజన దేశ చరిత్రలో అత్యంత దుర్ఘటనలలో ఒకటి. ఇందువల్ల లక్షలాది ప్రాణాలు కోల్పోయారు, కోట్లాది మంది తమ ఇళ్లను, ఊర్లను విడిచి శరణార్థులయ్యారు. వారి బాధ, విడిపోవు వేదన, మానవత్వం చూపిన అజ్ఞాత వీరుల ఔదార్యం ఇవన్నీ మన సామూహిక స్మృతిలో ఎప్పటికీ నిలిచి ఉండాలి. ప్రతి ఏటా మాదిరిగానే ఈరోజు భారతదేశం దేశ విభజన గాయాల స్మారక దినం (PartitionHorrorsRemembranceDay)ను పాటిస్తూ, ఆ దురదృష్టకరమైన చారిత్రక ఘట్టంలో అనేక మంది అనుభవించిన కల్లోలం, వేదనలను స్మరించుకుంటోంది.ఇది వారి ధైర్యసాహసాలను గౌరవించే రోజు కూడా… అప్రతిహతమైన నష్టాన్ని ఎదుర్కొని, మళ్లీ కొత్తగా జీవితం ఆరంభించే శక్తిని కనుగొన్న వారి సామర్థ్యాన్ని గుర్తుచేసే రోజు.ఆ విపత్తు ప్రభావితులలో చాలామంది, తమ జీవితాలను మళ్లీ నిర్మించుకుని విశేషమైన విజయాలను సాధించారు.మన దేశాన్ని ఏకం చేసే సామరస్య బంధాలను మరింత బలపరచే బాధ్యత మనపై ఉందని ఈ రోజు మనకు గుర్తు చేస్తుంది.
Previous Articleఏపీ ఎక్సైజ్ శాఖ కొత్త బార్ పాలసీ…సెప్టెంబర్ 1 నుండి అమల్లోకి..!
Next Article పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో టీడీపీ భారీ విజయం